Pages

Friday, January 29, 2021

గురు వ్యాఖ్యనం: 1




సాధన - 01


*ఓం గ్లౌం లంబోదరాయ నమః*


“గ్లౌం” అనేది గణపతికి సంబంధించిన గొప్ప బీజం. ఈ గ్లౌం అనే బీజంలో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి సమస్త వాయువుని కుంభించే కుండలనీ మంత్రం. రెండవది పృథ్వీమంత్రం. “లం” అనేది పృథివీ తత్వం, భూ తత్వం. అందుకనే అమ్మవారికి పంచ పూజలు చేసేటప్పుడు లమిత్యాదిపంచాపూజాంకుర్యాత్ అని పూజిస్తాము. అందులో ‘లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి’ అంటే భూతత్వం కలిగిన ఓ అమ్మా నీకు గంధం ఇస్తున్నాము అంటే భూమి యొక్క తత్వము గంధము అందుకనే ‘పృథివీ గంధవతీ’ అని అంటారు.  

వాయుతత్వము, పృథివీతత్వము కలిపినది గ్లౌం అనే బీజము. ‘లంబోదరాయ నమః’ అంటే పెద్ద పొట్టకలిగిన, పంచభూతాలలో ప్రధాన భూతాల తత్వాన్ని ఇముడ్చుకున్న మహానుభావుడైన గణపతికి నమస్కారము. ఈ మంత్రం పొట్టలకి అంటే ఉదర సంబంధించిన రోగాలను తొలగిస్తుంది. అందులో ముఖ్యంగా వాయువులకి సంబంధించిన రోగాలను తొలగిస్తుంది. వేళకి అన్నం తినకపోయినా, ఎక్కువ తిన్నా, శనగపిండి, మసాలా వంటివి తిన్నా వాటి వల్ల కడుపు ఉబ్బి “గ్యాస్ ట్రబుల్” వస్తుంది. అలా వాయోత్పత్తి వల్ల వచ్చే రోగాలను తొలగించే మంత్రం ఇది. అలాగే తినకూడనివి తినడం వల్ల, తాగకూడనివి తాగడం వల్ల అస్తమానం కాలకృత్యాలకి వెళ్లవలసి వస్తుంది. అది కూడా పెద్ద రోగమే. ఇలా జీర్ణక్రియ సరిగాలేని వారికోసం అగస్త్యమహర్షి అందించినటువంటి గొప్ప మంత్రం. మందులతోపాటు మంత్రం, మంత్రంతో పాటు మందు. 


*మంత్ర ప్రయోగం-ఫలితం*

ఈ మంత్రాన్ని ప్రతి బుధవారం సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదులు ముగించుకుని, సూర్యుడు ఉదయించే సమయానికి జపంలో కూర్చుని, 3000 పర్యాయాలు ఈ మంత్ర జపం చెయ్యాలి. మంత్రాన్ని నియమం ప్రకారం చెయ్యాలి కనుక బుధవారం, సూర్యోదయానికి ముందు లేచి, సూర్యోదయ సమయానికి శ్రద్ధగా మంత్ర జపం చెయ్యాలి. ఒకేసారి 3000 సార్లు చేయలేని వారు చిన్న విరామం తెసుకుని మళ్ళీ  మొదలు పెట్టి బుధవారం 3000 సార్లు పూర్తి చెయ్యాలి. ఆఖరులో వాము నీళ్ళలో కలుపుకుని తీర్థంలా పుచ్చుకుంటే 3 నెలలలో ఉదర రోగాలు పటాపంచలు అవుతాయి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...