Pages

Friday, February 12, 2021

గురు వ్యాఖ్యనం-18





ఓం హర్యక్ష వాహనాయై నమః


విదేశీ భయమును తొలగించేటువంటి మంత్రము ఇది. పొరుగు దేశానికి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, మన దేశం కాని దేశానికి, పరదేశాలకు వెళితే ఆ దేశంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. అష్ట కష్టములలో మొదటి కష్టము ఇదే. మొట్టమొదటి కష్టము పరదేశ యాత్ర అన్నారు. ఇంట్లో ఉన్నట్టుగా వేళకి ఇంత అన్నం పెట్టే వాళ్ళు ఉండరు, అక్కడకు వెళ్ళాక ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఈ భయం నిరంతరము మానవులను పట్టి పీడిస్తూ ఉంటుంది.

అందుకని పొరుగు దేశాలకు వెళ్లేముందు వాళ్లకు ఒక మండల దీక్షతో ఈ మంత్రమును చేయించి పంపించమని పూర్వకాలంలో చెప్పేవారు.

అందులో ముఖ్యముగా పూర్వకాలంలో సముద్రయానం చాలా కష్టంగా ఉండేది, ఓడల మీద వెళుతూ ఉంటే ఇలాంటి ఇంజన్లు ఉండేవి కాదు కాబట్టి మునిగిపోయేవారు కూడా. ఇవాళ్టి రోజుల్లో ఇంజన్లు ఉన్నప్పటికీ టైటానిక్ లాంటి ఓడలే మునిగిపోతున్నాయి, విమానంలో వెళ్లే వాళ్లు కూడా తిరిగి వచ్చేవరకూ నమ్మకం లేదు. ఇది కలియుగ ప్రభావము.

ఇటువంటి కాలంలో ఇంతకంటే గొప్ప వరం ఏమైనా ఉందా అంటే, ఇది తప్ప వేరేది లేదు.


మంత్ర ప్రయోగం - ఫలితం:


ఈ మంత్రాన్ని ఒక మండల దీక్షతో అంటే 40 రోజుల పాటు ఏకధాటిగా మధ్యలో ఒక్క రోజు కూడా ఆపకుండా రోజూ 108 పర్యాయములు చొప్పున పడుకోబోయే ముందు చెయ్యమన్నారు.

పడుకోబోయే ముందు స్నానము చెయ్యలేము అంటే కాళ్ళు, చేతులు కడుక్కున్నా పరవాలేదు, నిద్రపోవడానికి ముందు ఈ మంత్రము చెయ్యాలి. ఇలా 40 రోజులు చేయడం వలన విదేశాలకు వెళ్ళిన వాళ్ళు నిర్భయముగా తిరిగి వస్తారు. అక్కడ ఉన్నంత కాలం కూడా అధికారుల వలన కానీ, పోలీసుల వలనో లేదా ఇంకొక దాని వల్లనో ఇబ్బంది రాదు. ఎక్కడ చూసినా ఇవాళ మానవునికి విదేశ ప్రయాణము అంటే ఎంత మోజు ఉన్నదో, అంత భయం కూడా ఉన్నది. విద్యార్థులకూ భయమే, పెళ్లి అయిన వారికీ భయమే. పూర్వము మహారాజులు శత్రువుల మీద దండయాత్రకు వెళ్ళేటప్పుడు తమ దేశం కానీ దేశం మీదకు వెళ్లడానికి ముందు ఈ మంత్రం చేసి వెళ్లేవారట అంతటి గొప్ప వరము ఇది. ఇది లలితా త్రిశతి లోని మంత్రము. ఈ నామమును భక్తితో చేయండి, అన్ని రకాల విదేశీ భయాల నుండి విముక్తి పొందండి.

ఒకవేళ ఇప్పటికే అక్కడ భయముతో ఉంటే ఎవరితోనైనా ఒక నలభై రోజులపాటు జపం చేయించుకోండి, ఏ పురోహితుడి చేతనైనా చేయించుకోండి. దాని వలన అక్కడ నుంచి హాయిగా తిరిగి వస్తారు.


సూచన:

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...