ఓం వైశ్వానర వివర్ధకాయ నమః
అజీర్ణ వ్యాధుల కోసం ధన్వంతరి వైద్య శాస్త్రములో చెప్పిన మంత్రము ఇది.
గ్యాస్ ట్రబుల్ బాగా పెరిగిన వాళ్లకు (వాయువు అన్నమాట) సామాన్యులకు అర్థం కావడం కోసం తప్పనిసరై గ్యాస్ట్రబుల్ అంటున్నాము నిజానికి దీనిని సంస్కృతంలో కానీ ఆయుర్వేదంలో కానీ అపానవాయు బాధే అంటారు. ఇది మహా చెడ్డ బాధ. బ్రేవ్ బ్రేవ్ అంటూనే ఉంటారు తిన్నా తినకపోయినా కొంతమంది, లేదా మరొక రకంగా బాధ. ఈ వాయువు వల్ల వచ్చే బాధ అంతా ఇంతా కాదు. వాయువు ఉన్నా బాధే లేకపోయినా బాధే.
ఈ అపానవాయువు బాధ, అజీర్ణ వ్యాధుల బాధ తొలగించడానికి ధన్వంతరి మనందరికీ ఇచ్చిన గొప్ప మంత్రము.
ముందు దీనికి అర్థం తెలుసుకుంటే తరువాత చెయ్యాలనే కోరిక పుడుతుంది.
అగ్ని దేవుడికి అనేక నామాలు ఉన్నాయి అందులో వైశ్వానరుడు అని ఒక నామము ఉన్నది. నిజానికి ఈ వైశ్వానర అనే నామముతో ఉన్న అగ్ని దేవుడు అంటే విష్ణువే. విష్ణువు ఆ రూపంలో ఉన్నాడు.
ఎలా చెబుతున్నారు అని అంటే భగవద్గీత చదివితే అందరికీ ఆ విషయం తెలుస్తుంది.
శ్లో|| అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||
మనలో చతుర్విధములైన అన్నములు ఉన్నాయి (మనము తింటున్నవి) వీటిని వైశ్వానరుడు అనే పేరుతో నేను జీవుల శరీరంలో కి వెళ్లి జీర్ణం చేస్తున్నాను అని కృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పాడు.
ఇది మహాభారతంలోని భీష్మ పర్వము లో భగవద్గీత లోనిది.
అహం ౼నేను
వైశ్వానరః ౼ వైశ్వానరుడు అనే పేరుతో
భూత్వా ౼ మారి
ప్రాణినాం ౼ ప్రాణుల యొక్క
దేహం ౼ శరీరమును
ఆశ్రితః ౼ ఆశ్రయించుకుని ఉన్న వాడిని అవుతున్నాను (వాళ్లను ఆశ్రయించుకుని ఉన్నాను) జీర్ణశక్తిని పెంచుతున్నాను.
దీనిని వివర్ధకాయ అంటే పెంచేవాడు కూడా ధన్వంతరి అనే పేరుతో ఉన్న విష్ణువు.
మంత్ర ప్రయోగం - ఫలితం:
కాబట్టి అజీర్ణ సంబంధమైన వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు లేదా అపానాది వాయువులతో బాధపడే వాళ్ళు అనుదినము ఉదయము 12 పర్యాయములు ఈ మంత్రమును చదువుతూ పొట్టను తడుముకుని ఓం వైశ్వానర వివర్ధకాయ నమః ఓం వైశ్వానర వివర్ధ కాయ నమః అంటూ పొట్టను తడుముకుని జపం చేస్తే జీర్ణశక్తి పెరిగి ఈ అపానవాయువు బాధ తొలగుతుంది.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.