Pages

Saturday, February 6, 2021

గురు వ్యాఖ్యనం -8






ఓం చంపకొశోకపున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః


అమ్మవారు జగన్మాత లలితాదేవికి గొప్ప జుట్టు ఉంది. తల చక్కగా దువ్వుకుని అందులో చంపకం, అశోక పుష్పం, పున్నాగ పుష్పం, సౌగంధిక పుష్పం - ఈ నాలుగు పూలు తల్లో పెట్టుకుని ధగధగలాడుతున్న  నల్లని ఒత్తైన జుట్టు కలిగింది ఆవిడ. 'కచ' అంటే జుట్టు ముడి,  లసత్కచ  ప్రకాశిస్తున్న జుట్టు ముడి. అమ్మవారి జుట్టు సహజసిద్ధంగా సువాసన తో ఉంటుంది, ఆ సువాసనను పువ్వులకు ఇచ్చింది ఆ తల్లి.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

ఈ అద్భుతమైన నామాన్ని భక్తి శ్రద్ధలతో మన వీలుని బట్టి రోజూ 11 సార్లు చేసుకుంటే మనకి జుట్టు ఊడి పోవడం ఆగుతుంది, జుట్టు నల్లగా, ఒత్తుగా తయారు అవుతుంది.

సకల పాపాలు ఈ జుట్టుని ఆశ్రయించి ఉంటాయి. జుట్టుని ఆశ్రయించి ఉన్న పాపాలను తొలగిస్తుంది అనగా సద్బుద్ధిని ఇస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ జుట్టు పెరుగుతుంది.పెరిగిన జుట్టు దుర్బుద్ధి, పాపములు లేకుండా సద్బుద్ధిని ఆశ్రయించుకుంటుంది.

తెలిసో తెలియకో మానవులకి నెత్తిమీద చేతులు పెట్టుకోవడం అనే అలవాటు ఉంది. చేతివేళ్ళ చివరిలో  లక్ష్మి దేవి ఉంటుంది. శిరస్సు మీద చేతులు పెట్టుకున్న వాడు ఎంత గొప్ప వాడైనా  సరే దరిద్రుడు అవుతాడు అని మార్కండేయ పురాణం చెబుతోంది. ఆ పాపం పోవాలంటే ఈ మంత్రం జపం చేస్తే అప్పుడు దారిద్య్రం తొలగుతుంది. 27  సార్లు కానీ, 11 సార్లు కానీ, లేదా 40 రోజులు నియమం పెట్టుకుని రోజూ 108 సార్లు చేసుకోండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...