Pages

Sunday, February 7, 2021

గురు వ్యాఖ్యనం -9






ఓం వసుంధరాయై నమః


కొంతమందికి వారి పూర్వ కర్మ వల్ల భూమి యోగం ఉండదు. భూయోగం లేనివాడికి ఒక అద్భుతమైన మంత్రం వసుంధరా మంత్రం. లలితా సహస్రనామములో ఉన్న అమ్మవారి నామము ఇది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


ఈ మంత్రాన్ని 41 రోజులు చేస్తే భూమి లభిస్తుంది. ఆ భూమి మీద ఉన్న ఇంట్లో ఉండే యోగము  వస్తుంది. వసు శబ్దమునకు బంగారము అని కూడా అర్థం. వసుంధర అంటే బంగారమును ధరించేది. భూమికి వసుంధర అని ఎందుకు పేరు అంటే, భూమిలో అనేక రకములైన ధాతువులు ఉన్నాయి.


శరీరము మీద బంగారము నిలవక బాధపడే వారు, ధరించాలని ఆసక్తి ఉన్నవారు ఈ మంత్రాన్ని 3 శుక్రవారాల పాటు, ప్రతి శుక్రవారం 1008 సార్లు జపం చేయాలి. సువర్ణం నిలుస్తుంది.

వసు శబ్దమునకు ప్రాణము అని అర్థం. ప్రాణము సుఖముగా లేక  ఉత్సాహము లేక బాధపడే వాళ్ళు ప్రాణము ఎప్పుడు పోతుందో అని భయపడే వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం 108 సార్లు జపం యావజ్జీవితము చేయండి. ప్రాణభీతి ఉండదు. ప్రాణశక్తిని పెంచే చైతన్య మంత్రం ఇది. ఆరోగ్యాన్ని ఇస్తుంది.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...