Pages

Wednesday, February 10, 2021

గురు వ్యాఖ్యనం -12




ఓం రామేష్టాయ నమః


ఇవాళ మానవ జీవితం ఎంత భయంకరమైనదో అందరికీ తెలిసున్న విషయమే.నిత్యం సన్నిహితో మృత్యుః| మృత్యుదేవత ఎప్పుడూ మనకు పక్కనే ఉంటాడు. ఈ యముడికి ఎవరి మీదా ప్రేమ ఉండదు, ఎంతటి మిత్రుడి ప్రాణమైనా తీసేస్తాడు, విరోధి లేడూ, స్నేహితుడూ లేడు. అందుకనే యముడికి సమవర్తి అని పేరు.  ఇంటిలో నుంచి కాలు బయట పెడితే తిరిగి ఇంటిలోకి వస్తేనే వచ్చినట్లు లేకపోతే లేనట్లే. పూర్వ కాలంలో కంటే ఈ కాలంలో ఈ భయము మానవులకు ఎక్కువ అయ్యింది. బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి లోపలకు రావడం చాలా కష్టము, సుఖముగా తిరిగి రావడానికి ఫలానా మంత్రము చేసుకోండి అని వశిష్ఠులవారు ఇచ్చిన విశిష్ట మంత్రము. వార్ధక్యంలో ఉన్నవాళ్లకు ఇంకా గొప్ప మంత్రము ఇది. ఎందుకంటే పునర్జన్మ అనే ఒక భయంకరం ఉన్నది. ఇంటిలో నుండి బయటకు వెళ్ళిన తరువాత రావడం, రాకపోవడమే కాకుండా ఆరోగ్యంగా వెళ్లిపోవడం కూడా అవసరం.

ఏ క్షణమూ మనది కాదు, అన్నము కూడా నోటి దాకా వెళితేనే వెళ్లినట్లు, లేదంటే లేదు. ఇలాంటి మానవులకు దుర్మరణం లేకుండా చేస్తుంది, మోక్షమును కూడా ఇస్తుంది. నా అనుకున్న వాళ్ళకి దూరముగా అనాధ ప్రేతమై చావడము కంటే దురదృష్టము ఏముంటుంది. ఈ నామము చేస్తే ముందు దుర్మరణం రాదు, బంధువులకు దూరముగా ఎక్కడో చావడము ఉండదు, ఇంటిలో నుంచి బయటకు అడుగు పెట్టిన వాడు తిరిగి రాకపోవడం అనే భయం ఉండదు, శరీరము విడిచిపెట్ఠాక యమలోకానికి వెళ్లకుండా దివ్య లోకాలకు వెళ్తాడు.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


దీనికి కాలం లేదు, నియమము లేదు, ఈ పూట అని లేదు, ఎప్పుడూ, ప్రయాణం చేస్తూ ఉన్నా, తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా ఓం రామేష్టాయ నమః అనవచ్చు.

ఇవన్నీ బీజాక్షరాలు లేని మంత్రములు. బీజాక్షరాలు ఉంటే వాటి నియమములు వేరుగా ఉంటాయి. వాటిని ఉచ్చరించడానికి ఎక్కడపడితే అక్కడ అధికారము ఉండదు.

బీజ రహితములైన దివ్య మంత్రములు సులభములు, సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవడానికి పనికి వస్తాయి. అందువల్ల ఈ నామమును రోజూ చేసుకోండి.

తులసీదాసు ఈ నామమును రోజూ చేయడం వల్లనే హనుమంతుని సాక్షాత్కారము అయ్యిందని ఆయనే రాసుకున్నాడు. ఈ మంత్రము సర్వకాల సర్వావస్థల్లో చేసుకోదగినది. చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా చేసుకోవచ్చు.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...