ఓం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగాయై నమః
అత్యంత బలహీనమైనది మనస్సంటే. చిన్న చిన్న కష్టాలకు కూడా ఇది ఓర్చుకోలేదు. మానవులకు మనస్సు ఎంత బలహీనంగా ఉంటుందో స్వయంగా హనుమంతుడు, సీతాదేవి కూడా చూపించారు.
సీతాదేవిని అన్వేషణ చేయడానికి వెళ్ళాడు హనుమంతుడు, లంకానగరం మొత్తం తెగ వెతికాడు, ఎక్కడా సీతాదేవి కనబడలేదు, ఆగ్రహోదగ్రుడై లంకంతా ధ్వంసం చేసేద్దామా అనుకున్నాడు కూడా. కానీ తీరా రావణాసురుడు సీతను లంకకు తీసుకొని రాకపోతే వీడిని చంపడం ఎందుకు, లంకను పాడు చేయడం ఎందుకు. ఇప్పుడు సీత కనపడకపోతే నేను వెనక్కు వెళితే, రాముడు సీత కనబడిందా అని అడుగుతాడు, నేను సీత కనపడలేదు అంటాను, అప్పుడు ఆయన తట్టుకోలేక మరణిస్తే, లక్ష్మణుడు కూడా మరణిస్తాడు. రామ లక్ష్మణులు మరణిస్తే, భరత శత్రుఘ్నులు మరణిస్తారు, దీనితో అయోధ్యాపుర వాసులంతా ఆత్మహత్య చేసుకుంటారు, కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. మేమంతా కూడా చనిపోతాము.
ఇంత మందిని చంపడం కంటే అసలు నేను వెనక్కి వెళ్లకపోతే, నేను ఇంకా వస్తాను అని వాళ్ళు ఎదురు చూస్తారు కనుక నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకోకూడదా అనుకున్నాడు. విషము తాగి చచ్చిపోనా, ఉరివేసుకొని చచ్చిపోనా, లేదా అగ్నిలో దూకి చచ్చిపోనా అని అనుకున్నాడట ఆయన. అంతలోనే ఆయన మహానుభావుడు కనుక ధైర్యం తెచ్చుకున్నాడు, ఆగాడు. ఆగడము వలన మొత్తం రామాయణ కథ మారిపోయింది. సీత కూడా అంతే జడను మెడ చుట్టూ గట్టిగా వేసుకొని బిగించుకొని చనిపోతాను అనుకున్నది, ఇంతలో హనుమంతుడు వచ్చి రామ కథ చెప్పబట్టి ఆవిడ బ్రతికింది.
అప్పటికీ ఇప్పటికీ సీత అంటే మనమందరమూ జీవాత్మలము. ఏ బలహీన క్షణంలో తొందరపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటామో తెలియదు.
మంత్ర ప్రయోగము ౼ ఫలితము:
1) ఎవరికైనా ఎప్పుడైనా పిరికితనము వలన ఆత్మహత్య చేసుకోవాలని పిస్తే ఈ మంత్ర అనుష్ఠానము చేయండి
1) ఈ అద్భుతమైన లలితా దేవి మంత్రము మానవునికి బలహీనత లేకుండా చేస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనే బలహీనత పోవడంవలన ఆత్మస్థైర్యం కలిగి, జీవితములో అభివృద్ధిని ఇస్తుంది.
2) అగ్ని ప్రమాదం సంభవించి చుట్టుపక్కల ఇల్లు తగలబడి పోయి మన ఇంటి మీదకు కూడా ఆ అగ్నిజ్వాలలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు (జ్వాలా మాలినిక అంటే జ్వాలామాలలు తో కూడిన, క్షిప్త అంటే దానితో నిక్షిప్తము చేయబడినటువంటి, వహ్ని ప్రాకార మధ్యగా అంటే అగ్ని మధ్యలో ఉందట అగ్ని ప్రమాదము లేకుండా కూడా కాపాడుతుంది ఈ అద్భుత మంత్రము.
కాబట్టి ఇటు ఆత్మహత్యలు చేసుకోవాలనే బాధని తొలగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. తీవ్ర అగ్నిప్రమాదంలో నుండి కాపాడుతుంది.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.