*ఓం జాంబూనద వర్ణాయ హిరణ్యరేతసే నమః*
బ్రహ్మదేవుడు హిరణ్యరేతసుడు. ఆయనకి బంగారమే రేతస్సు. ఆయన రంగు కూడా బంగారపు రంగులో ఉంటుంది. ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన గొప్ప మంత్రం. జాంబూనదము అంటే బంగారము. ఈ భూమండలానికి జంబూద్వీపము లేక జంబూనదము అని పేరు. అసలు భూమి నుంచి పుట్టింది బంగారము.
ఈ భూమి మీద పూర్వకాలంలో చాలా నేరేడు చెట్లు ఉండేవి. ఇందులో ఉన్న రసం పడి ప్రవహించి దాని ప్రభావంతో బంగారము పుట్టటం వల్ల జాంబూనదం అన్నారు.ఇది పోయిన బంగారాన్ని తిరిగి తెప్పించేటటువంటి గొప్ప మంత్రం.
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు నుంచి ఒక తామరపువ్వు బయటికి వచ్చి అందులో బ్రహ్మదేవుడు ఉన్నటువంటి పటాన్ని పూజామందిరము లో పెట్టుకోండి
కొబ్బరికాయ కొట్టి పటమునకు నివేదన చేయండి. ఈ జపం చేస్తూ తులసీదళాలతో ఆ విష్ణువుని పూజించండి.
పూజానంతరం తులసీదళాలని కొంత ప్రసాదంగా తీసుకోండి, తక్కినవి చెట్టు కింద వేయండి. పటాన్ని పూజామందిరములో ఉంచేయండి. 3 శుక్రవారములు పాటు ప్రతి శుక్రవారం 1008 సార్లు ఈ మంత్ర జపం చేయండి. ఈ మూడు వారములు ఎడతెరిపి లేకుండా చేయాలి. పోయిన బంగారు నగలు తిరిగి వస్తాయి. మంత్ర ఉచ్చారణ స్పష్టంగా ఉండకపోతే జపం ఫలితం ఉండదు.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.