Pages

Wednesday, February 3, 2021

గురు వ్యాఖ్యనం-4




*ఓం  ఐం  హ్రీం  శ్రీం   శ్రీమహారాజ్ఞై నమః*


లలితా దేవి మంత్రాలలో ఒక అత్యద్భుతమైన మంత్రం ఇది. రాజ్ఞి అంటే రాణి అని అర్థం. అమ్మవారు  గొప్ప రాణి. ఆ తల్లి కంటే పైన మించిన మరియొక రాణి లేదు అనమాట.

ఇంక ఆధిపత్యం అంటే సంపూర్ణంగా జగత్తు మీద ఆ తల్లికి మాత్రమే ఉన్నది.

అన్ని శక్తులూ ఉన్నా ప్రేమతో మాత్రమే మారుస్తుంది. అయినా వినిపించుకోకపోతే శిక్షించి తల్లి గనుక దారిలో పెడుతుంది.  అందుకే అమ్మవారిని శ్రీమహారాజ్ఞీ అన్నారు. మహారాజు అంటే పరమేశ్వరుడు. ఆయన చాలా గొప్ప రాజు. ఆయన పైన మరొక రాజు లేడు చక్రవర్తి, ఆ చక్రవర్తికి ఇల్లాలు కూడా. దీన్ని జపిస్తే మహామంత్రం అవుతుంది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*

ఆధిపత్యం కోసం దీన్ని జపించాలి. 90 రోజులు పాటు ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయానికి లేచి స్నానం చేసి నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని 108 సార్లు జపిస్తే కోరుకున్న ఆధిపత్యం వస్తుంది.

సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడానికి ముందు ఎఱ్ఱబడుతుంది ఆకాశం అప్పుడు స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవాలి.ఒకే ఆసనం మీద కూర్చుని కదలకుండా  జపం చేయాలి. ఆసనం మీద నుంచి లేస్తే వ్యర్థం  అయిపోతుంది. ఉద్యోగాలలో జీతం పెరగని వాళ్ళు, ప్రమోషన్ల కొరకు 81 రోజుల పాటు సూర్యోదయ  సమయానికి స్నానం చేసి, దర్భాసనం మీద కూర్చుని రోజూ 108 పర్యాయాలు కదలకుండా జపం చేయండి. ఆరోగ్యం సహకరిస్తే రోజూ తలస్నానం చేయవచ్చు లేదా శుక్రవారం శిరఃస్నానము చేస్తే చాలు, ఉద్యోగంలో ఔన్నత్యం వస్తుంది మరియు జీతం పెరుగుతుంది.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...