Pages

Thursday, February 4, 2021

గురు వ్యాఖ్యనం -5




*ఓం  కావ్యాయ  నామదోషనివారకాయ శుక్రగ్రహాయ నమః*


కావ్యుడు అంటే శుక్రాచార్యుడు. నామములో ఉన్న దోషాన్ని తొలగించేటటువంటి  శుక్రగ్రహమున  కొరకు నమస్కారము.ఈ మంత్రం మనము తెలిసో తెలియకో పిచ్చి పేర్లు  పెట్టుకోవడం వల్ల వచ్చే దోషం తొలగిస్తుంది.


అక్షరాలతో పేరు పెట్టమని ఏ శాస్త్రం చెప్పలేదు. అక్షరములు ఆయా నక్షత్రములకు ప్రతీకలు.  ఆ అక్షరమును బట్టి నక్షత్రము తెలుసుకోవడం వరకే ఇది.


*మంత్ర ప్రయోగం - ఫలితం:*


ఒక శుక్రవారం  నాడు మొదలు పెట్టి పూజా మందిరము లో కూర్చుని ఒక జపమాల పెట్టుకుని 9 రోజుల పాటు 1008 సార్లు ఈ మంత్ర జపం చేయండి. 9 రోజులు అయ్యాక శుక్రుడికి ఇష్టమైనటువంటి తెల్లని వస్త్రం తెల్లని పంచెని, తెల్లని కండువాని ఒక పురోహితుడికో ,పండితుడికో దక్షిణతో దానం చేయండి. తెల్లని వస్త్రాలు మాత్రం పురోహితులకే ఇవ్వండి. పుచ్చుకునేందుకు ప్రత్యేకంగా అనుకూలత కలిగిన వాళ్ళు , అర్హత కలిగిన పురోహితులు ముఖ్యంగా నవగ్రహాలకి అర్చన చేసే వాళ్ళకి ఇవ్వండి. మా పిల్లల పేరుల్లో ఉన్న దోషాలు పోవాలని సంకల్పం చెప్పుకోండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

శ్రీ రామానుజల జీవిత చరిత్ర

  🌹 శ్రీ రామానుజుల జీవిత చరిత్ర 🌹            రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస...