గురుమూర్తి - మాతృమూర్తి అన్న పదాలకు అభేదం అంటుంది బ్రహ్మాండ పురాణం.
లలితాసహస్ర నామములలో సైతం గురుమూర్తి, గురుమండలరూపిణీ అనే నామాలు ఉన్నాయి.
గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః అని చిన్ననాటి నుంచి తెలుసుకుంటున్నాం. బ్రహ్మాండ పురాణం మరింత గొప్పగా అమ్మవారే గురు స్వరూపం అని తెలియచేస్తుంది. అమ్మ అంటేనే సకల జగత్తులను లీలగా సృష్టించగల శక్తి కలది. కాబట్టి అదే భావనతో గురువులను సైతం సేవించాలి.
కాబట్టి గురువులను నిరంతరం పూజించాలి, భక్తితో మెలగాలి, వ్యర్థ ప్రసంగములు మాని శ్రద్ధతో మసలుకోవాలి. అతిముఖ్యంగా గురువులను హేళన చేసి మాట్లాడటం కానీ, నా వల్ల గురువులకు ఇంత పేరుప్రతిష్ఠలు వచ్చాయి అని కానీ ఎప్పుడూ అనుకోరాదు. వారు తిడితే అది మనపై ఉన్న వాత్సల్యం, పొగిడితే అది మనకు వారు ఇచ్చిన గొప్ప కానుక అని భావించాలి. గురువులను తక్కువ చేసి చూడటం అంటే వాడు క్రింది లోకాలకు, నీచ జన్మలు ఎత్తుటకు తగు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని అర్థం.
గురువులు ఉన్నప్పుడే పూజించగల్గిన వాడు, సేవ చేయగలిగిన వాడు ధన్యుడు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.