ఓం పద్మ నిధయే నమః
శంఖము, పద్మము ఇలా 9 నిధులు ఈ సృష్టిలో ఉన్నాయి. వాటిని నవనిధులు అంటారు. ఈ నిధులలో పద్మనిధి అని ఒక గొప్ప నిధి ఉంది. లక్ష్మీదేవి 9 నిధులను తన శరీరానికి 9 అలంకారాలుగా చేసుకుంది . అందులో ఈ పద్మనిధి కూడా ఒకటి .
*మంత్ర ప్రయోగం - ఫలితం:*
నాలుగు చేతులతో, ఎఱ్ఱ తామరపువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీ అమ్మవారి ఒక చిన్న పటాన్ని ఎదురుగుండా పెట్టుకుని, కొంచెం పంచదార నైవేద్యం పెట్టి, ఈ నామాన్ని 9 రోజులు రోజుకి 1000 సార్లు జపం చేయాలి. మనకి రావాలసిన ఋణం రప్పిస్తుంది. అవతల వాళ్ళకి ఇవ్వవలసినవి ఇప్పిస్తుంది.
పద్మనిధి యొక్క లక్షణం ఏమిటంటే అప్పులు తీర్చగలిగే శక్తి ఇచ్చి, వారితో మనకి ఏ పీడా లేకుండా హాయిగా, సుఖంగా ఉండేలా చేస్తుంది. ఈ నామం యావజ్జీవితం చేసినవారి జీవితంలో ఋణము అనే ప్రసక్తి ఉండదు. ఆఖరున నైవేద్యం పెట్టిన పంచదార ఎవరు పూజ చేశారో వారే తినాలి. బయటివాళ్ళకి పెడితే వాళ్ళ ఋణాలు విముక్తి అవుతాయి. కుబేరుడిని కూడా ఋణవిముక్తుడ్ని చేసిన ఈ మంత్రం జపించుకుని ధన సంబంధమైన బాధల నుంచి విముక్తి పొందండి.
*సూచన:*
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని, లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org/
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.